- చిన్న వివాదమే కాల్పులకు కారణం!
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో ఓ సిఐఎస్ఎఫ్ జవాన్ ఘోరానికి పాల్పడ్డాడు. బసోలి ప్రాంతంలో ఉన్న సిఐఎస్ఎఫ్ క్యాంపులో విధులు నిర్వర్తిస్తున్న సిఐఎస్ఎఫ్ జవాన్, నలుగురు సహచర జవాన్లను విచక్షణారహితంగా కాల్చిచంపాడు. ఈ ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్‌తో సహా నలుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన ఇతర జవాన్లు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక జవాన్ల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదమే ఈ కాల్పులకు దారితీసినట్లు తెలుస్తోంది. సహచరులతో వాగ్వివాదానికి దిగిన నిందితుడు తీవ్ర ఆవేశంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న సీనియర్ పోలీసు, సిఐఎస్ఎఫ్ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలోని బసోహ్లి ప్రాంతంలోని మష్కా గ్రామంలో ఉన్న 'సేవా-3' జలవిద్యుత్ ప్రాజెక్ట్ వద్ద మంగళవారం సాయంత్రం 6.40 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, నిందితుడైన హెడ్ కానిస్టేబుల్ అభిదేశ్ కుమార్ తన సహచరులతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆవేశంతో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో నలుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఎన్‌హెచ్‌పిసి ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మృతులను అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్-ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుళ్లు రఫీక్ అహ్మద్, సందీప్ కుమార్‌లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం తోటి సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా ఘటనలో ఉపయోగించిన సర్వీస్ ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
కొద్దిరోజుల కిందట సిఆర్పిఎఫ్ క్యాంపులోనూ..
అస్సాంలోనూ ఇదే తరహా ఘటన కొద్ది రోజుల కిందట చోటుచేసుకుంది. నాగావ్ జిల్లా కటిమారి సిఆర్పిఎఫ్ క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఎఎస్ఐ బల్లానీ ప్రేమాబరం తన సహచరులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం ప్రేమాబరం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రేమాబరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. ఈ కాల్పుల్లో విష్ణు ప్రసాద్ బఘేల్, రామ్‌నవాల్ సింగ్ అనే జవాన్లు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు. ఏఎస్ఐ మానే గోవింద్ గాయపడగా చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.








కామెంట్లు (0)