ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుండెపోటుతో జార్ఖండ్‌ విద్యాశాఖ మంత్రి మృతి

1 గంట క్రితం

Sudivya Sonu,
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 08:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్ర ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖ మంత్రి, జేఎంఎం సీనియర్‌ నేత సుదివ్య కుమార్‌ సోను (56) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గిరిడీహ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

సుదివ్య సోను గిరిడీహ్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)లో కీలక నేతగా కొనసాగుతున్న ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై సీఎం హేమంత్‌ సోరేన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మృతి జేఎంఎం కుటుంబానికి, జార్ఖండ్‌ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదివ్య సోను సేవలు, పార్టీకి చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్