సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి

2 రోజుల క్రితం

J&K CM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 12:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, గతంలో అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాలకు అదనంగా ఈ తీర్మానాన్ని ఆమోదించాలని ఆయన కోరారు. అలాగే, తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సభ నిర్ణయించింది. 2000 జూన్‌ 26న ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్‌సి ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు 1953 ఆగస్టు 9కి ముందు ఉన్న విస్తృత స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం ఆమోదించింది. అనంతరం 2024 నవంబర్‌ 6న ప్రత్యేక హోదా పునరుద్ధరణను కోరుతూ అసెంబ్లీ మరో తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోదా పునరుద్ధరణపై తాజా తీర్మానాన్ని ఒమర్‌ అబ్దుల్లా ప్రవేశపెట్టారు. అయితే అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు. జమ్మూ కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిపై అసెంబ్లీలో చర్చను వ్యతిరేకించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్