సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం

06 ఆగస్టు, 2026

darshan-case
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 12:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు: రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న ప్రదోష్‌ అప్రూవర్‌గా మారనున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలన్నీ వెల్లడిస్తానని, తనను విడుదల చేయాలని కోరుతూ ప్రదోష్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రదోష్ వాంగ్మూలాన్ని త్వరలో అధికారికంగా నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ కేసులో ప్రదోష్‌ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా దర్శన్‌పై నేరం నిరూపణకు అవకాశం ఉందని ఆ వర్గాలు భావిస్తున్నాయి.

రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌, ఆయన స్నేహితురాలిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్