షేక్ హసీనా
న్యూఢిల్లీ : తన ప్రాణాలకు ముప్పు ఉన్నా.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా వెల్లడించారు. బుధవారం ఒక మీడియా సంస్థకు ఈమెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ హసీనా ఈ విషయాన్ని తెలిపారు. బంగ్లాదేశ్‌కు తిరిగివెళ్లిన తరువాత ‘నన్ను చంపవచ్చు. అరెస్టు చేయవచ్చు. లేదా జైలుకు పంపవచ్చు’ అని 78 ఏళ్ల హసీనా పేర్కొన్నారు. “నా గతి ఏంటో నాకు పూర్తిగా తెలుసు. అయినా, నేను తిరిగి వెళ్లాలనుకుం టున్నాను, ఎందుకంటే నా ప్రజలు నన్ను పిలుస్తున్నారు’’ అని తెలిపారు. బంగ్లాదేశ్‌లో 2024లో జరిగిన విద్యార్థి ఆందోళనలు తరువాత నుంచి హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ విద్యార్థి ఆందోళనలను క్రూరంగా అణచివేశారనే కేసులో ఢాకాలోని ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ హసీనాకు గత నవంబర్‌లో మరణశిక్ష విధించింది. ఈ తీర్పు వెలువడినప్పటి హసీనాను చట్టపరంగా విచారించేందుకు అప్పగించాలని భారత్‌ను బంగ్లాదేశ్ కోరుతోంది. అయితే తనపై కేసులను "రాజకీయ ప్రేరేపితమైనవి"గా హసీనా కొట్టిపారేశారు.







కామెంట్‌లు (0)