ఛత్రపతి సంభాజీనగర్ : మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐఫోన్ ఈఎంఐ చెల్లింపు విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన కునాల్ (19) అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి స్థానిక ఖవడ్యా డోంగర్ కొండపైకి వెళ్లాడు. కిందికి రావాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఎంతగా బతిమాలినా అతను వినలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. దాదాపు మూడు గంటలపాటు సహాయక చర్యలు కొనసాగాయి. ఈ సమయంలో కుమారుడిని కాపాడేందుకు తండ్రి మురళీధర్ (48) కూడా కొండపైకి వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు కునాల్, మురళీధర్ ఇద్దరూ కొండపై నుంచి జారిపడి మృతిచెందారు. కళ్ల ముందే కుమారుడు, భర్త ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన కునాల్ తల్లి సంగీత కూడా అదే కొండపై నుంచి దూకి మృతిచెందింది. అందరూ చూస్తుండగానే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది.
కళ్ల ముందే భర్త, కుమారుడి మృతి.. తల్లి ఆత్మహత్య
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 22, 2026, 07:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)