ప్రజాశక్తి-అల్లూరి : ఎటపాక మండలం గొల్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. మలేరియా నివారణలో భాగంగా విద్యార్థులకు సిబ్బంది పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలు వికటించడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. పాఠశాలలో మొత్తం 73 మంది విద్యార్థులకు ఈ మాత్రలు పంపిణీ చేయగా, వాటిని మింగిన కొద్దిసేపటికి వారిలో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే బాధితులను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మలేరియా మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 10:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)