బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కొత్త ఓటర్లూ కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వాల్సిందే : ఇసి

12 జులై, 2026

ec
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 10:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునే దరఖాస్తుదారులు కూడా తమ తల్లిదండ్రుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) వివరాలను సమర్పించడం తప్పనిసరి అని ఎన్నికల సంఘం (ఇసి) తెలిపింది. గతంలో ఎస్‌ఐఆర్‌ పరిధిలోకి రాని ప్రస్తుత ఓటర్లు మాత్రమే కాకుండా, కొత్త దరఖాస్తుదారులు కూడా ఈ నిబంధనను పాటించాల్సిదేనని ఇసి స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఓటర్ల జాబితాలో చేరడానికి ఫారం 6 నింపే కొత్త ఓటర్లు తమ తల్లిదండ్రుల ఎస్‌ఐఆర్‌ వివరాలను జతచేయడం తప్పనిసరి. ఈ నిబంధన గత ఏడాది జూన్‌లో ప్రారంభమైన బీహార్ ఎస్‌ఐఆర్‌‌లో చేర్చింది. కొత్త ఓటర్లు ఫారం 6తో పాటు ఈ డిక్లరేషన్‌ను సమర్పించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్