సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్మల్‌ పుర్జా మృతదేహం గుర్తింపు

1 రోజు క్రితం

dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 11:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లాహోర్‌ : మూడు రోజుల క్రితం ఆకస్మిక హిమపాతం వల్ల ప్రాణాలు కోల్పోయిన నేపాల్‌ - బ్రిటన్‌ పర్వాతారోహకులు నిర్మల్‌ ‌పుర్జా మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. పిఓకేలోని గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ఉన్న బ్రాడ్ పీక్ పర్వతంపై సుమారు 5,700 మీటర్ల ఎత్తులో మృతదేహాన్ని గుర్తించినట్లు ఆల్పైన్ క్లబ్ ఆఫ్ పాకిస్తాన్ (ఎసిబి) తెలిపింది. గురువారం సంభవించిన హిమపాతంలో మొత్తం పదిమంది మరణించగా, ఆదివారం నాటికి ఐదుగురు పర్వతారోహకుల మృతదేహాలను వెలికితీసినట్లు ఎసిబి తెలిపింది. మిగిలిన ఐదుగురి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. నిర్మల్ పుర్జాకు పర్వతారోహణలో విశేష అనుభవం ఉంది. 2019లో ఆరు నెలల ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న 14 శిఖరాలన్నింటినీ పుర్జా విజయవంతంగా అధిరోహించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్