న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో న్యాయం, జవాబుదారీతనం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా 'వన్ మోర్ వాయిస్' పేరుతో డిజిటల్ కార్యక్రమాన్ని ఫెయిర్‌కోడ్ ప్రారంభించింది. ప్రత్యక్షంగా నిరసనల్లో పాల్గొనలేని వారు కూడా తమ మద్దతును తెలియజేసేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఒక పదాన్ని నమోదు చేయడం ద్వారా విద్యార్థుల ఉద్యమానికి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేయవచ్చు. ఇలా నమోదయ్యే ప్రతి పదం దేశవ్యాప్తంగా పెరుగుతున్న సామూహిక స్వరంలో భాగమై, విద్యార్థుల పోరాటానికి ప్రజల మద్దతు ఉందనే సందేశాన్ని బలంగా చాటుతుందని పేర్కొన్నారు. నిష్పక్షపాతమైన విచారణ, పారదర్శకత, జవాబుదారీతనం విద్యార్థుల హక్కులని విశ్వసించే ప్రతి వ్యక్తి స్వరానికి ఈ వేదిక ప్రాతినిధ్యం వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ స్వరాలన్నీ కలిసి ప్రజా సంఘీభావానికి శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తాయని, న్యాయం కోసం వినిపిస్తున్న పిలుపు జంతర్‌మంతర్ నిరసన ప్రదేశానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిందని వెల్లడించారు.
ఇది పూర్తిగా శాంతియుత, వాణిజ్యేతర సంఘీభావ కార్యక్రమమని, విద్యార్థులకు మద్దతు తెలియజేయడం, వారి గొంతును మరింత బలంగా వినిపించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఫెయిర్‌కోడ్ స్పష్టం చేసింది.
ఇక్కడ క్లిక్ చేసి మీ సంఘీభావాన్ని తెలపండి







కామెంట్‌లు (0)