న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షలుగా పర్గత్ సింగ్‌ను నియమించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి ) శుక్రవారం సాయంత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. జలంధర్ కంటోన్మెంట్ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పర్గత్ సింగ్ గతంలో భారత హాకీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఫుల్-బ్యాక్ డిఫెండర్‌గా విశేష సేవల అందించి భారత హాకీ దిగ్గజంగా పేరు గాంచారు. కాగా, శుక్రవారం ముందుగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి అమరీందర్ సింగ్ రాజా వారింగ్ రాజీనామా చేశారు. న్యూఢిల్లీలో పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. వారింగ్ గత నాలుగేళ్లకు పైగా కాలం నుంచి పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా పర్గత్ సింగ్
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 03, 2026, 12:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)