న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండవ రోజైన మంగళవారం ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. సభా కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నిరసనను పోలీసులు క్రూరంగా అణచివేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సభలో లేవనెత్తారు. ఈ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. లోక్‌సభ సైతం మధ్యాహ్నానికి వాయిదా పడింది.
Parliament : ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 21, 2026, 11:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)