సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
న్యూఢిల్లీ : ప్రతిపక్ష ఎంపీలపై బిజెపి ప్రభుత్వం సాగిస్తున్న అణిచివేత చర్యలు సరికాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అన్నారు. పోలీసుల చర్యను బేబీ ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రజా పోరాటాలకు చారిత్రక కేంద్రమైన జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష ఎంపిలకు గళం విప్పే హక్కును నిరాకరించడం, మోడీ ప్రభుత్వపు బరితెగించిన నిరంకుశత్వాన్ని, ప్రజాస్వామ్య హక్కుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ధిక్కారాన్ని బయటపెట్టిందని ఎంఎ బేబీ విమర్శించారు. దేశరాజధానిలో భయోత్పాతాన్ని సృష్టించి అసమ్మతిని అణచివేసే ప్రయత్నం సఫలం కాదని స్పష్టం చేశారు. శాంతియుత నిరసనలను అణచివేసి, జ్ఞానేష్ కుమార్‌ను రక్షించడానికి పోలీసులను, కేంద్ర బలగాలను ప్రభుత్వం ఉపయోగించినా, అతనికి శాశ్వతంగా రక్షణ కల్పించలేరన్నారు. ఈ అణచివేత కొనసాగితే, ప్రజలు జ్ఞానేష్ కుమార్‌తో పాటు మోడీ, అమిత్ షాల చరిత్ర కూడా చెత్తబుట్టలో పడేస్తారన్నారు. ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని ఎంఎ బేబీ పిలుపునిచ్చారు.







కామెంట్‌లు (0)