మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్‌ జోషీ

25 జులై, 2026

minister
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 10:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్‌ ‌జోషిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సలహా మేరకు క్యాబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రస్తుత పోర్ట్‌ఫోలియోతో పాటు విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా అప్పగించాలని రాష్ట్రపతి ఆదేశించినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అలాగే, ప్రధానమంత్రి సలహా మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లోని క్లాజ్ (2) ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి తక్షణమే ఆమోదించారని కూడా ఈ ప్రకటన వెల్లడించింది. ప్రహ్లాద్‌ ‌జోషీ ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం- ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధనం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్