సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మూడు యూరోపియన్‌ దేశాల పర్యటనకు రాష్ర్టపతి

18 గంటల క్రితం

murmu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 11:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : మూడు యూరోపియన్‌ ‌దేశాల పర్యటనకు రాష్ర్టపతి ద్రౌపది ముర్ము ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఈ నెల 25 వరకూ ఈ పర్యటన సాగనుంది. మోల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. ఆయా దేశాలతో సంబంధాలను మరింత పెంపొందించుకోవడానికి, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి రాష్ర్టపతి అధికారిక పర్యటనలు చేపట్టారు. ఈ రెండు దేశాల్లో (మోల్డోవా, ఉత్తర మాసిడోనియా) భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. తూర్పు ఐరోపా దేశమైన మోల్డోవాతో ఆ పర్యటన ప్రారంభం అవుతుంది. తరువాత ఉత్తర మాసిడోనియా ఈ నెల 21, 22 తేదీలలో పర్యటించనున్నారు. ఇక్కడ నుంచి పర్యటన చివరి దశలో భాగంగా రొమేనియా ఈ నెల 23, 24, 25 తేదీల్లో రాష్ర్టపతి రొమేనియాలో పర్యటించనున్నారు. మూడు దశాబ్దాల తర్వాత భారత రాష్ట్రపతి ఈ ఆగ్నేయ యూరోపియన్ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్