మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబిజెపి జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి

1 రోజు క్రితం

D._Purandeswari,
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 12:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జాతీయ నూతన కార్యవర్గం ప్రకటన

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో:బిజెపి అధిష్ఠానం పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్‌‌కు చెందిన డి పురందేశ్వరిని ఉపాధ్యక్షులుగా బిజెపి నియమించింది. అలాగే, జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీని, జాయింట్‌ కోఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డిని, కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా తరుణ్‌ చుగ్‌, ఒబిసి మోర్చా నూతన అధ్యక్షుడిగా అమర్‌పాల్‌ మౌర్య పేర్లను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. సంస్థాగత జనరల్‌ సెక్రటరీగా బిఎల్ సంతోష్, సంస్థాగత జాయింట్‌ జనరల్‌ సెక్రటరీగా శివప్రకాష్‌ పేర్లను ప్రకటించింది. కాగా, బిజెపి జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు. పైగా ఉపాధ్యక్షురాలిగా ఉన్న డికె అరుణను తప్పించారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. వీరితో పాటు జాతీయ కోశాధికారిగా పీయూష్ గోయల్ (మహారాష్ట్ర), జాతీయ సంయుక్త కోశాధికారి రాజేష్ మంగళ్ ( రాజస్థాన్)ను నియమించింది. అయితే, బిజెపి ఐటీ సెల్‌కు కొత్త చీఫ్‌గా దీప‌క్ మాస్కేకు భాద్యతను అప్పగించింది. ఐటి సెల్ ఇన్‌ఛార్జిగా పనిచేసిన అమిత్ మాలవీయను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్‌ మాస్కేను కొత్త సోషల్ మీడియా కన్వీనర్‌గా నియమిస్తూ నిర్ణయించింది. అయితే పదేళ్లకుపైగా ఈ బాధ్యతలు నిర్వర్తించిన మాలవీయకు ఈసారి అవకాశం దక్కకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్