న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ నేతలు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ నిరసన చేపట్టారు. బుధవారం ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్‌లో ఎంపీలు వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. లంచ్ అనంతరం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఇండియా కూటమి నేతలు బస్సులో జంతర్ మంతర్‌కు బయలుదేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద బైఠాయించేందుకు విపక్ష నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ప్రియాంకా గాంధీ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. చివరకు పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను అరెస్ట్ చేసి బలవంతంగా బస్సులోకి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసులు తమపై దాడి చేశారని ఇండియా కూటమి ఎంపీలు ఆరోపించారు. రాహుల్ గాంధీతో పాటు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ, ఎంపీల అరెస్ట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 07, 2026, 07:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)