న్యూఢిల్లీ : అత్యాచారానికి గురైన నాలుగేళ్ల బాలికకు వైద్యం నిరాకరించిన ప్రైవేట్ వైద్యునిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘డాక్టర్ ’ అని రాసేందుకు కూడా అర్హత లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం మండిపడింది. దయలేకుండా, నిర్దయగా, కఠినంగా వ్యవహరించారని దుయ్యబట్టింది. ఆ డాక్టర్ వైద్య విలువలు పాటించలేదని, దీంతో తీవ్రగాయాలతో బాలిక మరణించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘విధులు సక్రమంగా నిర్వహించనందున ‘డాక్టర్’ అని రాసేందుకు మీకు అర్హత లేదు. సమస్య పట్ల సున్నితత్వం ఉంటే మీ ఆస్పత్రిలో వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోయినా.. మరో ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉండేవారు. కానీ వారు పేదవారు కావడం, మీ ఫీజు చెల్లించరనే కారణాలతో నిర్దయగా వదిలేశారు’’ అని ధర్మాసనం మండిపడింది. అటువంటి పరిస్తితి ఎదురైనపుడు.. ఏ వైద్యుడైనా సరే ఆ చిన్నారికి తగిన వైద్య సహాయం అందేలా చూడాలని కోర్టు పేర్కొంది. దారుణమైన నేరానికి గురైన చిన్నారిని మీ ఆస్పత్రికి తీసుకువచ్చినపుడు, కనీస వైద్య సేవలు కూడా అందించనంతగా మీరు నిర్దయగా వ్యవహరించారు. మీకు కనీసం మానవత్వమైనా ఉంటే, మీరే స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లివ ఉండేవారు అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఘజియాబాద్ పోలీసులపై కూడా ధర్మాసనం మండిపడింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, పోక్సో కింద కేసును నమోదు చేయడం, పోస్ట్‌మార్టమ్ నివేదికను రూపొందించడంలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘డాక్టర్’ అని రాసేందుకు కూడా నీకు అర్హత లేదు : సుప్రీంకోర్టు ఆగ్రహం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 17, 2026, 04:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)