మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎన్‌‌టిఎ, ఎన్‌ఇపిలను రద్దు చేయండి : సిపిఎం డిమాండ్‌

1 రోజు క్రితం

cpmlogo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 12:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : విద్యా వ్యవస్థలో క్షీణతకు మూల కారణమైన నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌‌టిఎ), జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) 2020లు రెండింటినీ రద్దు చేయాలన్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సిపిఎం) డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు పొలిట్‌‌బ్యూరో సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్‌‌టిఎ నిర్వహించిన మూడు నీట్‌-‌యుజిసి పరీక్షా పత్రాల్లో అవకతవకలు వచ్చిన నేపథ్యంలో సిపిఎం ఈ డిమాండ్‌ ‌చేసింది. ఈ అవమానకరమైన అధ్యాయం భారతదేశ విద్యా వ్యవస్థలో పాతుకుపోయిన కుళ్ళును మరోసారి బహిర్గతం చేసింది. ఈ పరీక్షలను నిర్వహించడంలో ఎన్‌‌టిఎ అసమర్ధతను చాటి చెప్పింది. ఎన్‌ఇపి వినాశకరమైన పర్యవసానాలకు పరిష్కార మార్గాన్ని చూడడానికి బదులుగా, బిజెపి దాని అనుబంధ సంస్థలు ఈ వ్యవస్థను ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరం. స్థానిక పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవని ప్రముఖంగా ప్రస్తావించినందుకు పశ్చిమ బెంగాల్‌‌లోని బంకూరాలో జనాబ్‌ ‌మాఫిక్‌‌ను దారుణంగా హత్య చేయడం వారి అసహనానికి పరాకాష్ట. ఈ హత్యను సిపిఎం తీవ్రంగా ఖండిస్తోంది. ఇందుకు కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని, వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని బిజెపి ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్‌ ‌చేసింది. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో తగినంత మంది ఉపాధ్యాయులు వుండేలా, సరైన మౌలిక వసతులు వుండేలా కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిపిఎం ప్రకటనలో కోరింది. విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, పారదర్శకతను పాటించడం, ఎలాంటి అవకతవకలకు తావులేని రీతిలో పరీక్షలు నిర్వహించడంపై వారు దృష్టి పెట్టాలి. కేవలం శుష్క వాగ్దానాలు, అణచివేత చర్యల వల్ల కాకుండా ఇటువంటి అర్ధవంతమైన చర్యల ద్వారానే విద్యార్ధులకు సాధికారత లభిస్తుందని పొలిట్‌‌బ్యూరో పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్