న్యూఢిల్లీ : ప్రముఖ పాత్రికేయుడు, ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్ధ వరదరాజన్, మెక్సికోకు చెందిన జర్నలిస్టు మార్సెలా తురతి 24వ ఎల్ ముండో అంతర్జాతీయ జర్నలిజం అవార్డులకు ఎంపికయ్యారు. పత్రికా స్వేచ్ఛ విభాగంలో వరదరాజన్‌ను, పాత్రికేయ రంగంలో మంచి కృషి సల్పినందుకు తురతిని జ్యూరీ ఎంపిక చేసింది. ఈ అవార్డులను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అందజేయనున్నారు. ఈ సందర్భంగా వరదరాజన్ మాట్లాడుతూ ఈ అవార్డుకు తనను ఎంపిక చేయడం వల్ల వైర్ పత్రికకు, భారతదేశంలో స్వతంత్ర జర్నలిజాని కి ఒక ఊపు, ఉత్సాహం లభించినట్లైందని అన్నారు. వరదరాజన్‌కు లభించిన పత్రికా స్వేచ్ఛ అవార్డు, భారతదేశంలోని స్వేచ్ఛా జర్నలిజం సంప్రదాయాల్లో ఒకదానికి గుర్తింపని ఎల్ ముండో డైరెక్టర్ మాన్సో వ్యాఖ్యా నించారు. మోడీ ప్రభుత్వ అధికార దుర్విని యోగాన్ని నిశితంగా పరిశీలించినందు కు ఆయన అనేక దావాలను, పోలీసు దర్యాప్తుల ను, ఆరోపణలను ఎదుర్కొన్నారని తెలిపారు.
సిద్ధార్థ వరదరాజన్‌కు ఎల్ ముండో అంతర్జాతీయ జర్నలిజం అవార్డు
24 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 12:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)