న్యూఢిల్లీ : ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త, సోనమ్ వాంగ్‌చుక్ ఆరురోజుల చికిత్స అనంతరం మేదాంత ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. తాను ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్నట్లు సోమవారం వాంగ్ చుక్ స్వయంగా ఎక్స్ పోస్ట్ ద్వారా తెలిపారు. చివరికి, ఈ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే రోజు రానే వచ్చిందని, లడఖ్‌లోని తన ఇంటికి వెళ్లే ముందు, మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు రాజ్ ఘాట్‌కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. సోనమ్ వాంగ్‌చుక్‌కు ‘అంతర్గత వైద్య నిపుణులు, ఐసియు, క్రిటికల్ యూనిట్ నిపుణుల’ సమన్వయంతో చికిత్స అందించినట్లు మేదాంత ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే సమయానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది.
సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న జంతర్‌మంతర్‌లో సిజెపి ఆందోళనలో పాల్గొన్నారు. 26 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జులై 18న ఆయనను బలవంతంగా సఫ్దర్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తనను నిర్బంధించినట్లు ఉందని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను మేదాంత ఆస్పత్రికి తరలించారు.







కామెంట్‌లు (0)