తెలంగాణ : హైడ్రా కమిషనర్ రంగనాధ్ ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కోర్టు సూచన చేసినా అమలు చేయకపోవటం పైన హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హైడ్రా పరిధిని మించి ప్రైవేటు స్థలాల విషయాల్లో తీసుకుంటున్న నిర్ణయాల పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. రంగనాధ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారికి హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. హైడ్రా కమిషన్ పైన వేటు వేయాలని హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. లోతుకుంట భూముల వ్యవహారంలో రంగనాధ్ తీరు పైన హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు మూడు సార్లు ఆదేశాలు ఇచ్చిన అమలు చేయకపోవటం పైన న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషనర్ కోర్టుకు క్షమాపణలు చెప్పినా.. తాము పరిగణలోకి తీసుకోవటం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలోనూ పలు మార్లు రంగనాధ్ కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేయటం పైన మండిపడింది. దీంతో, హైకోర్టు వెంటనే రంగనాధ్ ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
హైడ్రా కమిషనర్ రంగనాధ్ ను పదవి నుండి తప్పించండి : హైకోర్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 03:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)