మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రధాని మోడీ బర్త్‌డేకు గైర్హాజరైన విద్యార్థులకు రూ.500 జరిమానా!

1 రోజు క్రితం

pm modi.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 06:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఐఐఎం జమ్ము నిర్వాకం

శ్రీనగర్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన దీపారాధన కార్యక్రమానికి గైర్హాజరయ్యారంటూ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)-జమ్ము పలువురు విద్యార్థులకు జరిమానా విధించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ సయ్యద్‌ నాసీర్‌ హుస్సేన్‌ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. మోడీ పుట్టినరోజు కార్యక్రమానికి హాజరుకాని విద్యార్థులు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, లేదా రూ.500 జరిమానా చెల్లించాలని ఐఐఎం జమ్ము విద్యార్థి కౌన్సిల్‌ నోటీసులు ఇచ్చిందని ఆయన చెప్పారు. దీనికి శుక్రవారం డెడ్‌లైన్‌ విధిస్తూ జారీ చేసిన నోటీస్‌ను కూడా ఆయన సామాజిక మాధ్యమంలో షేర్‌ చేశారు. అసలు ప్రధాని పుట్టినరోజు వేడుకకు విద్యార్థులు తప్పనిసరిగా ఎందుకు హాజరుకావాలని ఆయన ప్రశ్నించారు. ‘ఇది ఐఐఎంలో ఏర్పాటు చేసిన ఒక విద్యాపరమైన బాధ్యతా? లేదా మోడీ ప్రచారాన్ని క్యాంపస్‌లో నిర్వహించడం తప్పనిసరి కార్యక్రమమా? విద్యా సంస్థల్లోని విద్యార్థుల్లో స్వతంత్ర భావాలను పెంపొందించాలే తప్ప వారిని రాజకీయ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించడం, లేకపోతే జరిమానాలు విధిస్తామని బెదిరించడం తగదు. బిజెపి ప్రచార విన్యాసాలను మన అత్యున్నత విద్యాసంస్థలకు దూరంగా ఉంచాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా దీనిపై ఐఐఎం జమ్ము స్టూడెంట్‌ అఫైర్స్‌ చైర్‌పర్సన్‌ బ్రిగేడ్‌ నీరజ్‌ సోని వివరణ ఇచ్చారు. ఏ విద్యార్థికి కూడా జరిమానా విధించ లేదని, అయితే స్వాతంత్య్ర దినోత్సవ వేడుక మాదిరిగానే ఇది కూడా సాధారణంగా తీసుకునే చర్యేనని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్