సిడబ్ల్యూసి భేటీలో మల్లికార్జున్ ఖర్గే
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విద్య, రామాలయ విరాళాలు చోరీ, జాతీయ భద్రత వంటి విషయాలలో మోడీ ప్రభుత్వాన్ని ఇంకా విశ్వసించవచ్చా? దేశ యువత ఆగ్రహంతో ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బుధవారం నాడిక్కడ ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సమావేశం జరిగింది. మరోవైపు వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించనున్నారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తరుణంలో, సిడబ్ల్యూసి ఈ అంశాలపై చర్చించి దేశం ముందు "ప్రత్యామ్నాయం, విధానం, పరిష్కారాలను" ఉంచాలని ఖర్గే అన్నారు. "మన పోరాటం ఎప్పుడూ కేవలం రాజకీయ అధికారం కోసం మాత్రమే సాగలేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడం, అలాగే భారత ప్రజల కోసం మరియు ఈ దేశాన్ని వారసత్వంగా పొందబోయే తరాల కోసం మెరుగైన భవిష్యత్తును నిర్మించడం కోసం సాగిన పోరాటం అది" అని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వ విధానాలతో దేశం యువత నిరాశ, నిస్పృహలకు లోనైన అవుతున్నారని అన్నారు. పెరుగుతున్న విద్యా ఖర్చులు, పాఠశాలల మూసివేత, ప్రశ్నపత్రాల లీకులు, నియామక పరీక్షలలో అవకతవకలు, నియామకాలలో జాప్యం వంటి వాటిని యువత ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. "ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి, అయినప్పటికీ మన యువత నాణ్యమైన విద్యను, అర్థవంతమైన ఉపాధిని పొందడానికి ఇబ్బంది పడుతున్నారు" అని ఖర్గే అన్నారు. ఈ సిడబ్ల్యూసి సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, కేరళ సిఎం విడి సతీశన్, హిమాచల్ ప్రదేశ్ సిఎం సుఖ్వీందర్ సింగ్, ఇతర సీనియర్ పార్టీ నాయకులు హాజరయ్యారు.








కామెంట్‌లు (0)