చెన్నై : గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ‘వెట్రి పయనం’ పథకం విస్తరించిన సేవలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ కండెక్టర్గా టిక్కెట్లు ఇచ్చారు.
ఈ విస్తరణతో రాష్ట్రంలో 84 లక్షల మందికి పైగా మహిళలు లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై మహిళలు డీలక్స్, ఎక్స్ప్రెస్ వంటి బస్సు సర్వీసుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఎలాంటి ఆదాయ పరిమితి లేదని, రోజువారీ ప్రయాణాల సంఖ్యపైనా ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది. అధికార పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) నుండి ఈపేరు వచ్చింది. ‘వెట్రి’ పదానికి విజయమని అర్థం. ‘వెట్రి పయనం’ అంటే విజయవంతమైన ప్రయాణం అని అర్థం.








కామెంట్లు (0)