న్యూఢిల్లీ : పార్లమెంటులో తమ స్పందనకు కేంద్రప్రభుత్వం గడువు విధించడంపై ‘అప్రజాస్వామికం’ అని సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్ధమని, సమాధానమివ్వడానికి బదులుగా ‘డొల్ల ప్రకటనలు’ ఇచ్చేందుకు యత్నించడమేనని అభివర్ణించారు. కేంద్రం రాజ్యాంగ బాధ్యతల నుండి తప్పించుకునేందుకు యత్నిస్తోందని అన్నారు. వర్షాకాల సమావేశాలను అకాలంగా ముగించడానికి బిజెపి కేవలం ఒక మార్గం కోసం వెతుకుతోందని అన్నారు. బాధ్యత, జవాబుదారీనతం అనేవి కాలపరిమితితో ఉండవని అన్నారు. రాజకీయ వాక్చాతుర్యం కంటే ప్రజలు కచ్చితమైన చర్యలను కోరుకుంటున్నారని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రసంగాలు వినే దశలో దేశం లేదని అన్నారు. అమిత్‌షా ప్రకటనపై కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ‘‘అమిత్ షా సభకు వచ్చారా, సభలో ఆయన మీతో ఇలా అన్నారా’’ అని మీడియాను ప్రశ్నించారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌కు, పెల్లెట్ గన్స్, టియర్‌గ్యాస్ ప్రయోగించడంపై అమిత్‌షా సమాధానమివ్వాలనే తమ వైఖరి స్పష్టమని మరో కాంగ్రెస్ ఎంపి ప్రణితి షిండే అన్నారు.
కేంద్రం గడువు విధించడం ‘అప్రజాస్వామికం’ : అఖిలేష్ యాదవ్
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 02:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)