ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం: పుతిన్‌

1 గంట క్రితం

PTI09_12_2026_000309B.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 06:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోందని రష్యా అధ్యక్ష‍ుడు పుతిన్‌ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రష్యా ఎప్పుడూ ఐరోపాను బెదిరించలేదని.. భవిష్యత్తులోనూ బెదిరించబోదని అన్నారు. తమ దేశ ప్రయోజనాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోందని అన్నారు. ‘ఐరోపా దేశాలను బెదిరించాలని మేం ఎందుకు అనుకుంటాం? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆ తర్వాత జరిగిందంతా రష్యన్ ఫెడరేషన్ సమ్మతితోనే జరిగింది. ఐరోపా దేశాల నేతలు ఇప్పుడు ఉక్రెయిన్‌లోకి మరింత మంది సైన్యాన్ని పంపడానికి చర్చలు జరుపుతున్నారు. అంటే వారు మాతో యుద్ధాన్ని కోరుకుంటున్నారు. వారి వల్లే యుద్ధం కొసాగుతోంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో.. ప్రపంచ దేశాల ఇంధన, ఆహార భద్రతకు సహకరించడానికి రష్యా సిద్ధంగా ఉంది.’ అని అన్నారు. పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం వంటి రంగాల్లో కార్యక్రమాలకు రష్యా తలుపులు తెరిచే ఉంటాయని, బ్రిక్స్ దేశాలన్నింటికీ చైతన్యవంతమైన, శక్తిమంతమైన దేశీయ మార్కెట్లు ఉన్నాయని చెప్పారు. బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. యావత్ ప్రపంచంతో కలిసి పనిచేయడానికి మాస్కో సిద్ధంగా ఉందన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పుతిన్‌ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్