ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపి నాయకుడు అశుతోష్‌ రాంకా అరెస్ట్‌

8 గంటల క్రితం

సిజెపి నాయకుడు అశుతోష్‌ రాంకా అరెస్ట్‌
- అస్సాం పోలీసులు తీరు ఖండించిన అభిజీత్‌ దీప్కే image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 07:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అస్సాం పోలీసులు తీరు ఖండించిన అభిజీత్‌ దీప్కే

​గువహటి : బిజెపి ఏలుబడిలోని అస్సాంలో విద్యార్ధులు సమావేశాన్ని కూడా నిర్వహించకుండా ప్రభుత్వం నిర్భందింస్తుంది. గువహటిలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) సహ వ్యవస్థాపకుడు అశుతోష్‌ రాంకా, ఆయన బృందాన్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శాంతి యుతంగా నిర్వహిస్తున్న సమావేశాన్ని పోలీసులు అడ్డుకుని, సిజెపి నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. అస్సాం పోలీసుల తీరును సిజెపి కన్వినర్‌ అభిజీత్‌ ‌దీప్కే ఖండించారు. అయితే, అస్సాంలోని పాఠశాలల వాస్తవ పరిస్థితులను బయటకు వెల్లడిస్తే.. వాటి దుస్థితి గురించి దేశానికి తెలిసిపోతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భయపడుతున్నారని రాంకా విమర్శించారు. కాజిరంగాలో మన ప్రజల హక్కులను ఎలా హరిస్తున్నారో, అలాగే భూమి, అడవులు, నీటి వనరులను లాక్కొని కార్పొరేట్ సంస్థలకు ఎలా కట్టబెడుతున్నారో అందరికీ తెలిసిందే అన్నారు. వాస్తవాలు బయటపడతాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భయపడుతున్నారని తెలిపారు. అస్సాం పోలీసులు అశుతోష్ రాంకా, సిజెపి బృందాన్ని అదుపులోకి తీసుకున్నారని, వారిని రహస్య ప్రదేశానికి తరలించారని అభిజీత్‌ దీప్కే సోషల్‌ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. అశుతోష్‌ , అతని బృందం అస్సాంలో స్వచ్ఛంద కార్యకర్తలతో ఒక సమావేశం నిర్వహిస్తుండగా అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని ఎక్కడైతే అరెస్టు చేశారో.. ఆ ప్రాంతం వెలుపల న్యాయవాదులున్నారని, కానీ పోలీసులు వారిని లోపలికి అనుమతించడం లేదని దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్