- ప్రధానికి బాలిక తల్లి విజ్ఞప్తి
- అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారన్న బాలిక
న్యూఢిల్లీ : తనను దూషించిన బాలికను క్షమిస్తున్నానన్న ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన టీనేజర్ తల్లి... తన కుమార్తెపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. 18 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకోవలని కోరింది. ఫిర్యాదులో 25 ఏళ్ల రిచికాసింగ్ అని పేర్కొన్నారని, తన కుమార్తె పేరు, వయసు రెండూ తప్పేనని చెప్పారు.
అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు : బాలిక
"‘నువ్వు ఎక్కడ కనిపించినా, నీపై అత్యాచారం చేసి ఏదో ఒక గోతిలో పడేస్తాం’ అని నాకు స్పష్టంగా చెబుతున్నారు," అని నోయిడాకు చెందిన ఆ బాలిక ఓ వార్తా సంస్థకు తెలిపింది. "ఈ రోజు కూడా ఉదయం, సాయంత్రం పోలీసులు మా ఇంటికి వచ్చారు. ఏదో పెద్ద నేరం చేసినట్లుగా వారు నా కోసం నిరంతరం వెతుకుతున్నారు. మోడీ నన్ను క్షమించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ దయచేసి, పోలీసుల చర్యలను మాత్రం నేను భరించలేకపోతున్నాను." అని పేర్కొంది. తనకు కేవలం 15 ఏళ్లేనని, ఇదే తన "మొదటి, చివరి తప్పు" అని అంతకుముందు ఆమె క్షమాపణ చెబుతున్న ఒక వీడియోను విడుదల చేసింది. అత్యాచార బెదిరింపులు అంశం వెలుగులోకి వచ్చినా పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. బాలికపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశామని, అయితే అది ఇంకా తమకు అందలేదని నోయిడా పోలీసులు ఆదివారం తెలిపారు. తన వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేసి, వేధిస్తున్న వారిపై స్థానిక పోలీసులు గానీ, ఢిల్లీ పోలీసులు గానీ విచారణ ప్రారంభించలేదు. ఆందోళనల సమయంలో యువతపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని మోడీ ప్రభుత్వం 'కాక్రోచ్ జనతా పార్టీ' (సిజెపి) కి హామీ ఇచ్చినప్పటికీ, క్షమించానని ప్రధాని ప్రకటించినప్పటికీ బాలికపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.
ఆ బాలికకు, ఆమె కుటుంబానికి చట్టపరమైన సహాయం అందిస్తామని సిజెపి ప్రతినిధి రత్న సింగ్ ఆదివారం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఆ బాలికకు అవసరమైన కౌన్సెలింగ్ మద్దతు లభించేలా చూస్తామని ఆమెకు భరోసా ఇచ్చాను" అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)