శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమీ పిల్లలకైతే ఇలాంటి ఆహారం పెడతారా ?

1 గంట క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 01:55 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మహారాష్ట్రలో పాఠశాల పిల్లలకు కాలం చెల్లిన ఆహారం

  • మంత్రులను, అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించిన అభిజిత్ దీప్కే

న్యూఢిల్లీ : ‘స్కూల్‌ ‌ఠీక్‌ ‌కరో’ ప్రచారంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను పరిశీలిస్తున్న కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజిత్‌‌ దీప్కే, ఆ స్కూళ్ళలోని మౌలిక వసతుల పట్ల, మధ్యాహ్న భోజన పథకంలోని ఆహార నాణ్యత పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో పలు గ్రామాల్లో ఆయన పర్యటించి, పాఠశాలల పరిస్థితిని తెలుసుకొన్నారు. అనంతరం ఈ విషయాలపై విలేకర్లతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం కింద ఉపయోగిస్తున్న ఆహార పదార్ధాలు కాలం చెల్లినవని తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఆరేడు నెలల క్రితమే కాలం చెల్లిన సరుకులను వారు ఉపయోగిస్తున్నారు. దీనిపై తాను మంత్రులను, ఎంఎల్‌ఎలను, అధికారులకు ఒక్క మాట అడగాలనుకుంటున్నానని అన్నారు. ‘మీ పిల్లలకైతే ఇలాంటి ఆహారం పెడతారా?’ అని దీప్కే ప్రశ్నించారు.

పాఠశాలల్లో తాగేందుకు నీళ్లు లేవు..

ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక సదుపాయాల పట్ల కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చాలా స్కూళ్ళలో తాగునీరు లేదని, వాష్‌‌రూమ్‌‌లు ఉపయోగించే విధంగా లేవని, బెంచీలు, తగినంతమంది బోధనా సిబ్బంది కూడా లేరని అన్నారు. ఇన్నేళ్ళ తర్వాత కూడా బెంచీలు లేక విద్యార్ధులు నేలపై కూర్చుని చదువుకోవాల్సి రావడం, పైగా కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితులుంటే ఈ ప్రభుత్వాలు సాధించిందేమిటని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

తన పర్యటన సందర్భంగా కడోలి అనే గ్రామంలో పాఠశాల భవనాన్ని చూస్తే 1950లో నిర్మించిన దానికి అప్పటి నుండి ఎలాంటి మరమ్మత్తులు కూడా చేపట్టలేదని అన్నారు. అంతటి దయనీయ పరిస్థితిలో ఆ పాఠశాల భవనం వుందన్నారు. విద్యార్ధుల అవసరాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన నేతలను విమర్శించారు. అయితే, ఆగస్టు 15న తన స్వంత గ్రామం శంతక్‌ ‌పిప్రి నుండి ఈ ప్రచారాన్ని దీప్కే ప్రారంభించారు. మహారాష్ట్రలోని ఇతర తాలుకాల్లో కూడా తన పర్యటన సాగుతుందన్నారు. తల్లిదండ్రులను, స్థానిక కమ్యూనిటీలను కలుపుకుంటూ సామాజిక ఆడిట్‌ ‌ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టాలని భావిస్తున్నట్లు అంతకుముందు దీప్కే చెప్పారు.

ఇటీవల రాజస్థాన్‌‌లో, అధికారులు బయటివారిని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించడాన్ని నిషేధించారు. స్కూళ్ళ ఆవరణల్లో ఫోటోగ్రఫీని, ఇంటర్వ్యూలను, ప్రత్యక్ష ప్రసారాలను నిషేధించారు. అయితే, దీప్కే ప్రచారానికీ ఈ ఆంక్షలకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టంగా చెప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాలల గురించి వ్యక్తిగతంగా వచ్చిన ఫిర్యాదులను విస్తృతమైన జవాబుదారీ ప్రచారంగా మర్చాలని దీప్కే భావిస్తున్నారు. పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితులను అధికార యంత్రాంగం, రాజకీయ నేతలు, స్ఠానిక కమ్యూనిటీలు ప్రత్యక్షంగా ఎదుర్కొనడం ద్వారానే అర్ధవంతమైన మెరుగుదల సాధ్యమవుతుందని దీప్కే స్పష్టం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్