శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​నేటి నుంచి ఆంధ్ర × కర్ణాటక రంజీ మ్యాచ్‌

1 గంట క్రితం

ACA.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 11:23 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కెఎల్ రాహుల్ రాకతో ప్రత్యేక ఆకర్షణ ​

  • ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం..

  • పటిష్ట బ్యాటింగ్ లైనప్‌తో కర్ణాటక..

  • ధీటుగా ఎదుర్కొనేందుకు ఆంధ్ర జట్టు సిద్ధం

​ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : ​ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జట్ల మధ్య నేటి నుంచి జరగనున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, ప్రతిరోజూ 90 ఓవర్ల ఆట నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోరులో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ​మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లలో కఠోరంగా శ్రమించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సాధన చేస్తూ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యారు.

​కెఎల్ రాహుల్ రాకతో ప్రత్యేక ఆకర్షణ...

​భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. కర్ణాటక జట్టులో కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు ఉండటంతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది.

​యువ జట్టుతో విజయమే లక్ష్యంగా ఆంధ్ర...

​కెప్టెన్ రికీ భూయ్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న ఆంధ్ర జట్టు, పటిష్టమైన కర్ణాటక జట్టుకు ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైంది. యువ ఆటగాళ్ల సమష్టి ప్రదర్శనతో విజయం సాధిస్తామనే ధీమాతో ఆంధ్ర జట్టు ఉంది. ప్రత్యర్థి జట్టు బలాబలాలను అంచనా వేసుకుంటూ మెరుగైన ప్రదర్శనపై దృష్టి సారించింది.

​మ్యాచ్‌కు ఏసీఏ ఏర్పాట్లు పూర్తి.. పోలీసుల పటిష్ట బందోబస్తు...

​రంజీ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆటగాళ్లు, మ్యాచ్ నిర్వహణ సిబ్బంది, భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో ఎవరైనా యువకులు లేదంటే ఇంకెవరైనా అత్యుత్సాహం చూపిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ​మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎసిఎ కార్యదర్శి సానా సతీష్ బాబు స్పష్టం చేశారు. కెఎల్ రాహుల్ రాకతో ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


రంజీ ట్రోఫీ 2026-27 గ్రూపులు(ఎలైట్ జట్లు)...

గ్రూప్-ఎ: బరోడా, బీహార్, గోవా, జమ్ము కశ్మీర్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, విదర్భ

గ్రూప్-బి: ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, కర్ణాటక, పంజాబ్, సౌరాష్ట్ర, త్రిపుర

గ్రూప్-సి: బంగాల్, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, సర్వీసెస్

గ్రూప్-డి: చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ముంబయి, రైల్వేస్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్