శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ షెడ్యూల్‌ విడుదల

3 గంటల క్రితం

hockey.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • భారత్‌ తొలి ప్రత్యర్ధి బంగ్లాదేశ్‌

  • పాకిస్తాన్‌ దూరం

జలంధర్‌: హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ-2026 టోర్నీలో భారతజట్టు తొలి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ ఆతిథ్యం ఇచ్చే ఈ టోర్నీకి పాకిస్తాన్‌ దూరం కావడంతో ఆ జట్టు స్థానంలో బంగ్లాదేశ్‌ చోటు దక్కించుకుంది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు పంజాబ్‌లోని జలంధర్, మొహాలీ వేదికగా ట్రోఫీ జరగనుంది. తాజాగా టోర్నీ షెడ్యూల్‌ను హాకీ ఇండియా విడుదల చేసింది. మొత్తం ఆరు దేశాలు బరిలోకి దిగుతున్నాయి. భారత్‌లో మ్యాచ్‌లను ఆడేందుకు పాకిస్థాన్‌ హాకీ ఫెడరేషన్‌ (పీహెచ్‌ఎఫ్‌) నిరాకరించింది. ఈ టోర్నీని వేరే దేశానికి తరలించాలని.. లేదా తమ జట్టు ఆడే మ్యాచులను తటస్థ వేదికను కేటాయించాలని డిమాండ్ చేయగా.. ఆ విజ్ఞప్తిని ఆసియా హాకీ ఫెడరేషన్ తిరస్కరించింది.

షెడ్యూల్‌...

27(మంగళ) : భారత్‌ × బంగ్లాదేశ్‌

29(గురు) : భారత్‌ × చైనా

30(శుక్ర) : భారత్‌ × జపాన్‌

నవంబర్‌ 1(ఆది): భారత్‌ × మలేసియా

2(సోమ) : భారత్‌ × కొరియా

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్