సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionAsian Games: సత్తా చాటిన అథ్లెట్లు

58 నిమిషాల క్రితం

vidya-2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:27 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • మూడేసి రజత, కాంస్య పతకాలు

  • అర్ధసెంచరీకి చేరువలో భారత్‌

ఐచి-నగోయా(జపాన్‌): ఆసియా క్రీడల్లో 9వ రోజు భారత అథ్లెట్లు కదం తొక్కారు. సోమవారం మూడేసి రజత, కాంస్య పతకాలతో మెరిసారు. షూటింగ్‌ విభాగంలో మరో రజత పతకం లభించగా.. కురాష్‌లో మరో కాంస్య పతకం దక్కింది. మొత్తం సోమవారం 8 పతకాలు దక్కాయి. దీంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ 4స్వర్ణ, 20రజత, 21 కాంస్యాలతో సహా మొత్తం 45 పతకాలతో 12వ స్థానంలో ఉంది. సోమ వారం జరిగిన మహిళల హార్డిల్స్‌ 400మీ. వ్యక్తిగత విభాగంలో విద్యా రామరాజ్‌ పిటి ఉష రికార్డును బ్రేక్‌ చేసింది. మిక్స్‌డ్ రిలేలో రజత పతకం గెలుపొందిన విద్యా రామరాజ్‌ వ్యక్తిగత విభాగంలోనూ కాంస్య పతకంతో మెరిసింది. తొలుత పిటి ఉష జాతీయ రికార్డు సమం చేసిన విద్య.. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేసింది. దాంతో.. ఒకే ఎడిషన్‌లో రెండుసార్లు పోడియం మీద మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిందీ పరుగుల చిరుత. సోమవారం జరిగిన మహిళల 400 మీ. హర్డిల్స్‌ ఫైనల్లో విద్య 54.57 సెకన్లలో గమ్యానికి చేరి మూడోస్థానంలో నిలిచింది. 55.42 సెకన్లతో పీటీ ఉష రికార్డు సమం చేసిన విద్య ఈసారి 01.51 సెకన్ల కంటే తక్కువ టైమింగ్‌లోనే హర్డిల్స్‌ను దాటింది. దాంతో.. మరోమారు పోడియం మీద సగర్వంగా కాంస్య పతకాన్ని స్వీకరించింది. యుఎఇకి చెందిన మరియం కరీం పసిడి, అడెలినా జెమ్స్(కజకిస్థాన్‌) రజతం గెలుపొందారు.

హైజంప్‌లో శర్వేష్‌ కుషారె: పురుషుల హైజంప్‌లో భారత అథ్లెట్‌ శర్వేష్‌ కుషారె అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించాడు. శర్వేష్‌ రెండో ప్రయత్నంలో 2.25 మీటర్లు దూకడంతో రజత పతకానికి పరిమితమయ్యాడు. చైనీస్‌ తైపీకి చెందిన ఫు చావో హుసన్‌ 2.30మీటర్లు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కొరియాకు చెందిన వూ సంఘ్యీక్‌ 2.22 మీటర్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.

25మీ. పిస్టల్‌లో ఈషా: షూట‌ర్ ఈషా సింగ్‌ ఆసియా క్రీడల్లో ర‌జ‌త ప‌త‌కంతో మెరిసింది. సోమవారం జరిగిన 25 మీట‌ర్ల పిస్టల్‌ వ్యక్తిగత విభాగం హోరాహోరీగా జ‌రిగిన ఫైన‌ల్‌లో.. గోల్డ్ మెడ‌ల్ కోసం ఈషా సింగ్ ట‌ఫ్ ఫైట్ ఇచ్చింది. టీమ్ ఈవెంట్‌లో విఫ‌ల‌మైన ఈషా సింగ్.. వ్య‌క్తిగ‌త 25మీ పిస్టల్‌ ఈవెంట్‌లో త‌న స‌త్తా చాటింది. ఉత్తర కొరియా క్రీడాకారిణి కిమ్ హోన్ సుక్‌తో జ‌రిగిన మూడు షూట్ ఆఫ్ గేమ్స్‌లో గ‌ట్టెక్కిన ఈషా.. చైనా క్రీడాకారిణి జియో జియారుగ్జాన్‌తో జ‌రిగిన రెండో షూట్ ఆఫ్‌లో 4-3 తేడాతో ఓడిపోయింది. దీంతో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని చేజిక్కించుకునే అవ‌కాశాన్ని ఈషా కోల్పోయింది. ఫైన‌ల్స్ క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో 8వ స్థానంలో ఉన్న యువ షూట‌ర్ ఈషా.. అసాధార‌ణ పోరాట స్పూర్తిని ప్ర‌ద‌ర్శించింది. పోటాపోటీగా అయిదు సార్లు జ‌రిగిన షూట్ ఆఫ్ ఈవెంట్ల‌ను ఆమె గెలుచుకోవ‌డం గ‌మ‌నార్హం. 38-38 స్కోరుతో టై అయిన స‌మ‌యంలో షూట్ ఆఫ్స్ జ‌రిగాయి.

​కురాష్‌లో పింకీ: పురాతనమైన కురాష్ ఆటలో పింకీ బల్హారా కాంస్యంతో గర్జించింది. మహిళల 78 కిలోల విభాగంలో అదరగొడుతూ క్వార్టర్ ఫైనల్లో గరమ్ లిమ్‌ను చిత్తు చేసిన పింకీ.. సెమీస్‌లో సుమిమ్ మో చేతిలో కంగుతిన్నది. మోకాలి గాయంతో బాధ పడుతున్న తను గొప్పగా పోరాడినప్పటికీ.. ప్రత్యర్థి మాత్రం మోకాలి మీదే అటాక్ చేసింది. దాంతో.. పింకీ ఓటమితో కాంస్యం గెలచుకుంది. 2018 జకర్తా ఆసియా క్రీడల్లో పింకీ 54 కిలోల విభాగంలో పోటీపడి రజతం ఒడిసిపట్టింది.

లాంగ్‌జంప్‌: మహిళల లాంగ్‌ జంప్‌లో భారత అథ్లెట్‌ సోజన్‌ ఆధిపత్యం కొనసాగించింది. ఆమె ఐదో జంప్‌లో 6.53 మీటర్ల దూరం దూకి 2వ స్థానంలో నిలిచింది. అయితే ఆరో, చివరి జంప్‌లో చైనా అథ్లెట్‌ హుయాంగ్‌ యింగ్యింగ్‌ 6.55 మీటర్ల దూరం దూకి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంతో తృటిలో బంగారు పతకాన్ని చేజార్చుకొని రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మూడో స్థానంలోనైనా నిలుస్తానని భావించిన మరో భారత అథ్లెట్‌ షైలి సింగ్‌కు నిరాశ ఎదురైంది. ఆమె 6.46మీ. దూరం దూకింది. ఈ విభాగంలో కాంస్య పతకం కూడా చైనాకే లభించింది.

200 మీటర్ల రేసులోనూ కాంస్యం: మహిళల 200 మీటర్ల రన్నింగ్‌లో భారత్‌ నుంచి ఇద్దరు అథ్లెట్లు ఫైనల్‌కు చేరగా.. హరిత భద్ర మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 200 మీటర్ల పతక పోరులో హరిత భద్ర రేసును 23.20 సెకన్లలో పూర్తి చేసింది. సింగపూర్‌కు చెందిన పెరీరా శాంతి 22.78 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం, చైనా అథ్లెట్‌ చెన్‌ యుజి 22.93 సెకన్లతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. మరో భారత అథ్లెట్‌ ఉన్నతి అయ్యప్ప బొలాండ్‌ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

డెకథ్లాన్‌లో తేజస్విని: పది రకాల క్రీడలు ఉండే డెకథ్లాన్‌లో భారత్‌కు మరో కాంస్య పతకం లభించింది. తేజస్విని శంకర్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకున్నాడు. అతడు మొత్తం 7,934 పాయింట్లు సాధించాడు. జపాన్‌కు చెందిన మరుయమ యుమ 8,123 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. చైనా అథ్లెట్‌ 8,012 పాయింట్లతో రజత పతకం సాధించాడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్