ఒకే ఈవెంట్‌లో స్వర్ణం, కాంస్యం
జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. మహిళల 100 మీటర్ల టీ12 (T12) ఈవెంట్‌లో భారత్‌కు ఒకే సారి రెండు పతకాలు లభించాయి. భారత స్టార్ అథ్లెట్ సిమ్రాన్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా.. మరో భారత క్రీడాకారిణి తేజిబెన్ దామోర్ కాంస్య పతకాన్ని సాధించింది.
మహిళల 100 మీటర్ల టీ12 ఫైనల్ రేసును సిమ్రాన్ కేవలం 24.80 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త గేమ్స్ రికార్డును నెలకొల్పింది. మరోవైపు తేజిబెన్ దామోర్ 25.23 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఇరాన్ అథ్లెట్ హజార్ సఫర్జాదే 25.02 సెకన్లతో రజత పతకాన్ని సాధించింది.







కామెంట్‌లు (0)