- కొరియా ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ
సియోల్: కొరియా ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి భారత యువ సంచలనం అస్మిత చలహా ప్రవేశించింది. శనివారం జరిగిన మూడుసెట్ల హోరాహోరీ పోరులో అస్మిత భారత్‌కే చెందిన సహచర క్రీడాకారిణి రక్షిత రామ్‌రాజ్‌ను ఓడించింది. ఉత్కంఠభరితంగా భారత ఇరువురు షట్లర్ల మధ్య జరిగిన ఈ పోరులో అస్మిత 21-13, 16-21, 21-13 తేడాతో రక్షిత రామ్‌రాజ్‌ను చిత్తుచేసింది. ప్రపంచ 50వ ర్యాంకర్ అస్మిత.. ప్రపంచ 49వ ర్యాంకర్ రక్షితను చిత్తుచేయడం విశేషం. తొలి గేమ్‌లో ఆట వేగాన్ని తన నియంత్రణలోకి తీసుకొని.. ఆ ఆధిపత్యం ప్రదర్శిస్తూ 21-13తో ఆ గేమ్‌ను గెలుచుకుంది. ఇక రెండో గేమ్‌లో రక్షిత సెట్‌ను చేజారనివ్వలేదు. ఆ గేమ్ మధ్యలో అశ్మిత పుంజుకునేలా కనిపించినప్పటికీ, రక్షిత తన పట్టును సడలించకుండా 21-16తో విజయం సాధించింది. ఇక మూడవ గేమ్‌లో 11-3 ఆధిక్యంతో దూసుకెళ్లిన అస్మిత.. తన తోటి క్రీడాకారిణిపై స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించింది. నిర్ణయాత్మక గేమ్‌ను 21-13 తేడాతో గెలుచుకుని ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్‌కు చేరే క్రమంలో అస్మిత క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌కు చెందిన 22వ ర్యాంకర్ హినా అకెచినిపై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. క్వార్టర్ ఫైనల్స్‌లో అస్మిత 20-22, 21-15, 21-19 తేడాతో ఓడించి అకేచినిపై విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో అస్మిత చైనాకు చెందిన హాన్ కియాన్ క్సీతో తలపడనుంది.








కామెంట్‌లు (0)