శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సెమీస్‌‌కు అస్మిత, రక్షిత

11 గంటల క్రితం

rakshita
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 11:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- క్వార్టర్స్‌‌లో ఓడిన తన్వీ శర్మ

- కొరియా మాస్టర్స్‌ ‌బ్యాడ్మింటన్‌ ‌టోర్నీ

సియోల్‌: కొరియా మాస్టర్స్‌ ‌సూపర్‌-300 ‌బ్యాడ్మింటన్‌ ‌టోర్నీ సెమీఫైనల్లోకి అస్మిత చాలీహా ప్రవేశించగా.. స్టార్‌ ‌షట్లర్‌ ‌తన్వీ శర్మ క్వార్టర్‌ ‌ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ‌ఫైనల్లో ‌17 ఏళ్ల తన్వీ శర్మ తన తోటి భారత క్రీడాకారిణి రక్షితా రామ్‌‌రాజ్ చేతిలో 21-18, 19-21, 18-21 తేడాతో పోరాడి ఓడింది. దీంతో బిడబ్ల్యూఎఫ్‌ ‌ప్రపపంచ టూర్‌‌లో తన్వీ పోరాటం ముగిసింది. తొలి గేమ్‌ను గెలుచుకుని రెండో గేమ్‌‌లోనూ గెలుపుకు చేరువైనా.. రక్షిత పుంజుకుని ఆ గేమ్‌‌ను గెలిచింది. నిర్ణయాత్మక గేమ్‌లో స్వల్ప తేడాతో గెలిచి, హెడ్-టు-హెడ్ రికార్డులో 4-0 ఆధిక్యాన్ని సాధించింది. సెమీస్‌‌లో రక్షిత భారత్‌‌కే చెందిన అస్మిత చాలీహాతో తలపడనుంది. ఇక క్వార్టర్‌ ‌ఫైనల్లో అస్మిత 20-22, 21-15, 21-19తో హినా అకెచిని(కొరియా)ను ఓడించి సెమీస్‌‌కు చేరారు. ఇక మహిళల డబుల్స్‌లో సోనాలి సింగ్-రితిక ఠాకర్ జోడీ, ఏడో సీడ్ జపాన్ జోడీ సుమిరే నకాడే-మియు తకహషి చేతిలో 21-15, 21-9 తేడాతో, మిక్స్‌డ్ డబుల్స్‌లో, ఆరో సీడ్ జోడీ ఇషాన్ భట్నాగర్-శ్రుతి మిశ్రా 21-16, 16-21, 21-13తో షిన్ టే-యాంగ్-కిమ్ యు జంగ్(ద.కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్