శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చీప్‌ సెలెక్టర్‌ అన్వేషణలో బిసిసిఐ?

14 గంటల క్రితం

bcci
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 12:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- అక్టోబర్‌ 4తో ముగియనున్న గడువు రేసులో పార్దీవ్‌, ఓఝా

ముంబయి: టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ గడువు అక్టోబర్ 4తో ముగియనుంది. చివరి అసైన్‌మెంట్‌గా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌, టీ20 సిరీస్‌లతోపాటు ఆసియా క్రీడలకు జట్టును ప్రకటించింది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ. అగార్కర్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా అదే చివరి ఎంపిక అని ప్రకటించడంతో అతనిని తప్పనిసరిగా తప్పిస్తారనే సమాచారం. దీంతో అగార్కర్‌ పదవీకాలం దగ్గర పడుతున్నా క్రమంలో అతని కాంట్రాక్ట్‌ని వచ్చే ఏడాది 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ కొనసాగిస్తారా? కొత్త చీఫ్ సెలక్టర్‌ను తీసుకుంటారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అజిత్ అగార్కర్ స్థానంలో కొత్త చీఫ్ సెలక్టర్‌ను నియమించేందుకు బీసీసీఐ అన్వేషణ ప్రారంభించినట్టుగా సోషల్ మీడియాలో పలువురు పేర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరిలో ప్రధానంగా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్, స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝాలలో ఒకరు ఖాయమని తెలుస్తోంది. 2023 జూలైలో చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్.. ఈ మూడేళ్లలో 3 ఐసిసి ట్రోఫీలను అందించాడు. 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ టైటిల్స్ తోపాటు ఆసియా కప్ టోర్నీలు కూడా అగార్కర్‌ నేతృత్వంలోనే వచ్చాయ. అయితే 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన తర్వాత రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం, 2026 టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం, సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టెస్టు రిటైర్మెంట్ ప్రకటన అగార్కర్‌కు తలనొప్పిగా మారాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్