- తొలి టీ20లో ఆఫ్ఘన్‌పై ఘన విజయం
న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్‌తో ప్రారంభమైన మూడూ మ్యాచ్ టీ20 సిరీస్‌లో భారత్ బోణి చేసింది. ఆదివారం జరిగిన న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని .. 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య చేధనలో భారత ఓపెనర్ సంజు శాంసన్ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చినా, ఈ దశలో అభిషేక్ శర్మ (82 పరుగులతో (32 బంతుల్లో)) -ఇషాన్ కిషన్ (42 పరుగులు, 33 బంతుల్లో) జడీ జట్టును విజయం నడిపిచింది. ఈ జోడీ రెండు వికెట్‌కు 139 పరుగులు జోడించింది. తరువాత శ్రేయర్ అయ్యర్ (8), తిలక్ వర్మ (3) నాటౌట్‌గా విజయాన్ని అందించారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో వన్డే ఈ నెల 15న జరగనుంది. ఆదివారం మ్యాచ్‌లో ముందుగా టాస్ ఓడిన అఫ్గానిస్థాన్ బాట్యింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 156/8 స్కోరు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (64*) హాఫ్ సెంచరీ బాదాడు. నబీ (33) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవరి తలో వికెట్ తీశారు. ఇబ్రహీం జద్రాన్ (11), నూర్ అహ్మద్ (0) రనౌటయ్యారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో శివమ్ దూబే 21 పరుగులు ఇవ్వడం గమనార్హం.
తొలిసారిగా వందేమాతరం ఆలాపన
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బారత్- ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 మ్యాచ్ ముందు, 'జన గణ మన' జాతీయ గీతం తర్వాత, బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన 'వందేమాతరం' జాతీయ గీతాన్ని వినిపించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడా చరిత్రలో వందేమాతరంను వినిపించడం ఇదే మొదటిసారి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశం మేరకు వందేమాతరం ఆరు చరణాలన్నింటినీ వాయించారు. ఆట ప్రారంభానికి ముందు, జాతీయ గీతం (52 సెకన్లు), జాతీయ గీతం (3 నిమిషాల 10 సెకన్లు) రెండూ కలిసి మొత్తం నాలుగు నిమిషాల రెండు సెకన్ల సమయం తీసుకున్నాయి. దేశంలో ప్రస్తుతం వందేమాతరం ఆరు చరణాలపై వివాదం రేగుతున్న తరుణంలో ఈ విధంగా ఆలపించడం గమనార్హం.








కామెంట్‌లు (0)