గోవా: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) జట్లు పోటీపడిన గార్డియన్స్ ట్రోఫీ (అండర్-21) విజేతగా హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ నిలిచింది. ఆదివారం గోవాలో జరిగిన ఫైనల్లో 15-7, 11-15, 16-14, 15-8తో గోవాపై గెలుపొందింది. అంతకుముందు సెమీఫైనల్లో 16-14, 15-9, 16-14తో అహ్మదాబాద్‌పై వరుస సెట్లలో విజయం సాధించిన బ్లాక్‌హాక్స్ అదే ఊపులో టైటిల్ పోరులోనూ సత్తా చాటింది. ఫైనల్లో రాణించిన సార్థక్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మోస్ట్ వాల్యూవబుల్ ప్లేయర్‌గా నిలిచాడు. చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఆటగాళ్లను, కోచ్ వెంకటేశ్వర్ రావును ఆ ప్రాంఛైజీ యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి అభినందించారు.
గార్డియన్స్ ట్రోఫీ బ్లాక్‌హాక్స్ వశం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 11:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)