సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వార్మప్‌ ‌మ్యాచ్‌‌లో గెలుపుతో టెస్ట్‌ సిరీస్‌ విజయంపై ధీమా

1 గంట క్రితం

cricket
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 11:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- జట్టు కూర్పుపై కసరత్తు షురూ సమతూకంలో టీమిండియా

కొలంబో: ‌శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌‌ల సిరీస్‌‌కు ముందు జరిగిన వార్మప్‌‌మ్యాచ్‌‌లో గెలుపుతో సిరీస్‌ ‌గెలుపు కెప్టెన్‌ శుభ్‌‌మన్‌ ‌గిల్‌, కోచ్‌ ‌గౌతమ్‌ ‌గంభీర్‌ ‌ధీమా వ్యక్తం చేస్తున్నారు. 15 నుంచిగాలే వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కోసం భారత అత్యుత్తమ తుది జట్టు సిద్ధమైంది. సన్నాహక మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు కూర్పును సిద్ధం చేశారు. శ్రీలంకతో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌ లో కెఎల్‌ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి ‌దిగడం ఖాయం. సన్నాహక మ్యాచ్‌లో వీరిద్దరూ తొలి వికెట్‌‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే ఇందుకు నిదర్శనం. జైస్వాల్ దూకుడుగా ఆడగా.. కెఎల్‌ రాహుల్ లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొని ఎక్కువ సేపు క్రీజులో ఉన్నాడు. మూడో స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్ అవకాశం దక్కించుకోవడం ఖాయం. సన్నాహక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు భారీ శతకంతో మెరిసాడు. ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి 44పరుగులతో రాణించాడు. ఇక ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, ఆరో స్థానంలో ధ్రువ్ జురెల్ బరిలో దిగడం ఖాయం. ఇక ఆల్‌‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్‌లో స్థిరమైన ప్రదర్శన ఇస్తూ జట్టుకు వెన్నుముకగా మారాడు.

ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఇద్దరు రెగ్యులర్‌ ‌స్పిన్నర్లు, ఇద్దరు రెగ్యులర్‌ ‌పేసర్లతో చోటు కల్పించాలని మేనేజ్‌‌మెంట్‌ ‌భావిస్తే.. ఒక్కొక్కరు కొత్తగా టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. బౌలింగ్ బాధ్యతలను మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మోయనున్నారు. సన్నాహక మ్యాచ్‌లో వీరిద్దరూ సత్తా చాటి జట్టులో స్థానాలు ఖాయం చేసుకున్నారు. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్‌‌తోపాటు మానవ్‌ ‌సుతార్‌‌కు చోటు దక్కడం ఖాయం.

శ్రీలంక ఎలెవెన్‌‌తో జరిగిన మూడ్రోజుల మ్యాచ్‌‌లోనే టీమిండియా గెలుపులో బ్యాటర్ల పాత్రను తక్కువచేసి చూడలేం. శ్రీలంక ఎలెవెన్‌ ‌రెండో ఇన్నింగ్స్‌‌లో 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ‌డిక్లేర్డ్‌ ‌చేయడంతో టీమిండియా 45ఓవర్లలో 214పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. ఆ లక్ష్యాన్ని శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ‌సేన నిర్ణీత ఓవర్లలో ఛేదించడం అందరి మన్ననలను అందుకుంది. ముఖ్యంగా మహ్మద్‌ ‌సిరాజ్‌ ‌చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌‌ను టీమిండియా పక్షాన నిలిపాడు. దీంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్‌ ‌మ్యాచ్‌‌ల సిరీస్‌ ‌ఫలితం తేలడం ఖాయం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్