అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ (68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం అర్జెంటీనాలోని రొసారియోలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మెస్సీ కెరీర్‌లో జార్జ్ మెస్సీ కీలక పాత్ర పోషించారు. తండ్రిగానే కాకుండా చాలాకాలం మెస్సీకి ప్రతినిధిగా, సన్నిహిత సలహాదారుగా ఆయన వ్యవహరించారు. చిన్నతనం నుంచే మెస్సీ ఫుట్‌బాల్ ప్రయాణానికి అండగా నిలిచారు. 2026 ఫిఫా వరల్డ్‌కప్ సమయంలోనూ జార్జ్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మెస్సీ తండ్రి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జార్జ్ మృతికి పలు ఫుట్‌బాల్ క్లబ్‌లు, సంస్థలు సంతాపం ప్రకటించాయి. ఇంటర్ మియామీ కూడా జార్జ్ మృతికి నివాళిగా మాంటెర్రేతో జరిగిన మ్యాచ్‌కు ముందు మౌనం పాటించింది. తండ్రి మరణం కారణంగా మెస్సీ ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. మెస్సీ లేకుండానే ఆడిన ఇంటర్ మియామీ 2–1తో మాంటెర్రే చేతిలో ఓడిపోయింది.
మెస్సీ కుటుంబంలో తీవ్ర విషాదం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 09, 2026, 09:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)