శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Diamond League: నీరజ్‌కు రజతం

20 గంటల క్రితం

Neeraj-1.jpg.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 07:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పతిరగే 88.14 మీటర్లతో స్వర్ణ పతకం

లుసానే: లుసానే డైమండ్‌ లీగ్‌లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా రజత పతకం సాధించాడు. 88.05 మీటర్ల దూరం ఈటె విసిరి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేశాడు. అయితే శ్రీలంకకు చెందిన రుమేశ్‌ పతిరగే 88.14 మీటర్లతో నీరజ్‌ను అధిగమించి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్‌ పీటర్స్‌ 86.61 మీటర్లతో కాంస్య పతకం సాధించాడు.

తొలి రౌండ్‌లో నీరజ్‌ 83.54 మీటర్లు విసిరి శుభారంభం చేశాడు. రెండో రౌండ్‌లో 88.05 మీటర్లతో సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మూడో రౌండ్‌లో 83.72 మీటర్లకే పరిమితమైన నీరజ్‌, నాలుగో రౌండ్‌లో ఫౌల్‌ చేశాడు.
పతిరగే తొలి రౌండ్‌లో 87.06 మీటర్లు విసిరి నీరజ్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. అయితే అనంతరం 88.14 మీటర్లతో నీరజ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. నాలుగో రౌండ్‌లో 86.71 మీటర్లు విసిరినా తన ఆధిక్యాన్ని కొనసాగించాడు.

పీటర్స్‌ తొలి రౌండ్‌లో 84.76 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో రౌండ్‌లో 86.61 మీటర్లతో తన ప్రదర్శనను మెరుగుపరుచుకున్నాడు. చివరి రౌండ్‌కు నీరజ్‌ దూరంగా ఉండగా, పతిరగే ఫౌల్‌ చేశాడు. మిగతా అథ్లెట్లు 70 నుంచి 80 మీటర్ల మధ్యకే పరిమితం కావడంతో నీరజ్‌కు రజత పతకం ఖరారైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్