ఆస్ట్రేలియా (అండర్-19) 174ఆలౌట్
అహ్మదాబాద్: భారత్-ఆస్ట్రేలియా అండర్ 19 జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా(అండర్-19) జట్టును కేవలం 174 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో చార్లీ హెండర్సన్(37) టాప్ స్కోరర్. నీల్ పటేల్ (31), జేకబ్ పీట్జ్ (26), ప్యాట్రిక్ సుల్లివాన్ (20), థామస్ వసియో (14) రెండంకెల స్కోర్లు చేశారు. భారత స్పిన్నర్ తన్మయ్ బలోడా (25-11-32-6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన్మయ్‌తో పాటు అయాన్ అక్రమ్ (2-45), మోహిత్ ఉల్వా (1-38), ప్రియాన్షు సింగ్ (1-21) రాణించడంతో ఆసీస్ 174 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో, ఓపెనర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందని ఒక్క పరుగుకే ఔట్ కాగా.. మరో ఓపెనర్ సాగర్ విర్క్ 16 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కుషాగ్రా ఓఝా 13, కెప్టెన్ యశ్‌వర్దన్ చౌహాన్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. థామస్ వేసియో, స్పెన్సల్ గ్రీన్‌కు తలో వికెట్ దక్కింది. తొలి అనధికారిక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.








కామెంట్‌లు (0)