శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్పోర్ట్స్‌ బ్యాలెన్స్‌ ఐటెమ్స్‌

1 గంట క్రితం

dulip
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 10:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నేటినుంచి దులీప్‌ ‌ట్రోఫీ ఫైనల్‌

చెన్నై: ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ ‌టోర్నీ దులీప్‌ ‌ట్రోఫీ ఫైనల్‌ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. సౌత్‌‌జోన్‌, ఈస్ట్‌‌జోన్ల మధ్య చెన్నైలోని ఎం. చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్‌ ‌జరగనుంది. యువ క్రికెటర్లకి తోడు టీమిండియా ఆటగాళ్లతో కూడిన ఈ రెడ్‌‌బాల్‌ ‌క్రికెట్‌లో ఇరుజట్లు తొలిసారి టైటిల్‌‌పై గురిపెట్టాయి. శనివారం మైదానాన్ని పరిశీలించిన ఈస్ట్‌‌జోన్‌ ‌కెప్టెన్‌ ఇషాన్‌ ‌కిషన్‌ ‌మాట్లాడుతూ.. ఈ పిచ్‌ ‌ముందు బ్యాటర్లకు అనుకూలమని తెలిపాడు. సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ‌ఛాంపియన్‌ ‌సెంట్రల్‌ ‌జోన్‌‌పై ఇషాన్‌ ‌కిషన్‌ ‌సారథ్యంలోని ఈస్‌‌జోన్‌ ‌జట్టు ఓడించి 14ఏళ్ల తర్వాత ఫైనల్‌‌కు చేరింది. ఈ జట్టు చివరిసారిగా 2012లో తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించింది. అలాగే ఈ జట్టులో వైభవ్‌ ‌సూర్యవంశీకి తోడు మహ్మద్‌ ‌షమీపైనే అందరి దృష్టి నెలకొంది. కెరీర్‌‌లో తొలిసారి దేశవాళీ టోర్నీ ఆడుతున్న సూర్యవంవీ, సెమీఫైనల్లో 92పరుగులతో రాణించాడు. సెమీఫైనల్లో ఈస్ట్‌‌జోన్‌ ‌జట్టు 4వికెట్ల తేడాతో సెంట్రల్‌ ‌జోన్‌‌పై, సౌత్‌‌జోన్‌ ‌జట్టు 7వికెట్ల తేడాతో నార్త్‌‌జోన్‌‌పై విజయం సాధించి ఫైనల్‌‌కు చేరాయి.

జట్లు(అంచనా) సౌత్‌‌జోన్‌: తిలక్‌ ‌వర్మ(కెప్టెన్‌), రికీ బుయ్‌, జగదీశన్‌, షేక్‌ ‌రషీద్‌, రవిచంద్రన్‌, హిమతేజ, శ్రేయస్‌ ‌గోపాల్‌, త్యాగరాజన్‌, కావేరప్ప, నిదేశ్‌, సాయితేజ. ఈస్ట్‌‌జోన్‌: ఇషాన్‌ ‌కిషన్‌(‌కెప్టెన్‌), అభిమన్యు ఈశ్వరన్‌, సూర్యవంశీ, కుషగ్ర, కుమార్‌ ‌ఘరామీ, విరాట్‌ ‌సింగ్‌, షాబాజ్‌ అహ్మద్‌, అనుకుల్‌ ‌రాయ్‌, మహ్మద్‌ ‌షమీ, ముఖేష్‌ ‌కుమార్‌, అభిజిత్‌ ‌సర్కార్‌.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్