లీడ్స్: తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ను 135 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 8వికెట్ల నష్టానికి 366 పరుగులతో నాల్గోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు మరో 43 పరుగులు జతచేసి చివరి రెండో వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ స్మిత్(25)కి తోడు ఆర్చర్(23నాటౌట్), టంగ్(8) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో ఇంగ్లాండ్‌కు 238పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. పాకిస్తాన్ బౌలర్లు ఉస్మాన్‌కు ఐదు, షాజాద్‌కు మూడు, అబ్బాస్, మహమ్మద్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో 171పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 135పరుగులకే ఆలౌటైంది. రిజ్వాన్(41), మసూద్(29) టాప్‌స్కోరర్లు. ఇంగ్లాండ్ బౌలర్లు రాబిన్సన్, ఆర్చర్, టంగ్‌కు మూడేసి వికెట్లు పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాబిన్సన్‌కు లభించింది. దీంతో మూడు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండోటెస్ట లార్డ్స్ వేదికగా 27నుంచి ప్రారంభం కానుంది.
తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 21, 2026, 11:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)