గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంగ్లాండ్‌ చేతిలో పాకిస్థాన్‌ విలవిల

1 గంట క్రితం

test cricket
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 11:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- తొలి టెస్టులో ఆతిథ్య జట్టు పైచేయి

లీడ్స్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్‌ బౌలర్లు అదరగొట్టారు. పేసర్లు ఒల్లీ రాబిన్సన్, జోష్ టంగ్ చెరో ఐదు వికెట్లు పడగొట్టడంతో పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. రాబిన్సన్‌ 5/51, టంగ్‌ 5/46తో పాక్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన జో రూట్‌ 37 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, జోర్డాన్‌ కాక్స్‌ 23 పరుగులతో అతడికి అండగా ఉన్నాడు. దీంతో ఇంగ్లాండ్‌ పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు కేవలం 59 పరుగులు వెనుకబడి ఉంది. తొలి బంతికే పాకిస్థాన్‌ వికెట్‌ పడగొట్టిన రాబిన్సన్‌, తన పునరాగమన టెస్టును ఘనంగా ప్రారంభించాడు. తొలి రోజే చెరో ఐదు వికెట్లు తీసుకున్న రాబిన్సన్‌, టంగ్‌ అరుదైన ఘనతను నమోదు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్