బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మద్యం రవాణా కేసు నిందితుడికి సుప్రీంలో చుక్కెదురు

1 గంట క్రితం

liquor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 01:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్‌కు బదులు సాధారణ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. సిజెఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో సిట్‌ ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేయగా, కోర్టు ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. సిట్‌ దర్యాప్తు ప్రారంభమైన సమయంలో ఆయన దుబాయ్‌ వెళ్లిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులోనూ ముందస్తు బెయిల్‌ కోసం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దర్యాప్తు సంస్థ ఎదుట లొంగిపోవాల్సిందేనని సిజెఐ ధర్మాసనం స్పష్టం చేసింది. తాజాగా మద్యం రవాణా కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఒకే వ్యవహారానికి సంబంధించి రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై సిజెఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్