బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionHong Kong Open : రెండోరౌండ్‌కు లక్ష్యసేన్, శ్రీకాంత్‌

37 నిమిషాల క్రితం

హాంకాంగ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 11:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హాంకాంగ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

హాంకాంగ్‌: హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో లక్ష‍్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌తోపాటు, మహిళల సింగిల్స్‌లో అస్మిత చాలీహా శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో లక్ష్యసేన్ మూడుసెట్ల ఉత్కంఠపోరులో ఫ్రాన్స్‌కు చెందిన మెర్కెలేను, కిదాంబి శ్రీకాంత్‌ జపాన్‌కు చెందిన వటనాబేను ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు చేరారు. లక్ష్యసేన్ 14-21, 21-16, 25-23తో ఫ్రాన్స్‌ షట్లర్‌ మెర్కెలేను ఓడించాడు. ఇక కిదాంబి శ్రీకాంత్‌ 21-16, 16-21, 21-9తో వాటనాబేను ఓడించాడు. ఈ మ్యాచ్‌ సుమారు 51 నిమిషాలసేపు సాగింది. మరో పోటీలో సంతోష్‌ రామ్‌రాజ్‌ 21-18, 21-18తో డెన్మార్క్‌కు చెందిన బ్లిచ్‌డెఫ్టను చిత్తుచేశాడు.

ఇక మహిళల సింగిల్స్‌లో అస్మిత చాలీహా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ గేమ్‌లో అస్మిత 12-21తో తొలి గేమ్‌లో ఓడినా.. ఆ తర్వాత రెండు గేమ్‌లను 21-13, 21-12తో భారత్‌కే చెందిన ఇషారాణి బూరాహ్‌పై విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరింది. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా, అన్మోల్‌ ఖర్బ్‌ తొలిరౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ఉన్నతి 21-17తో తొలి గేమ్‌ నెగ్గినా.. ఆ తర్వాత రెండు గేమ్‌లను 19-21, 17-21తో 8వ ర్యాంకర్‌, చైనాకు చెందిన హన్‌ యూ చేతిలో పరాజయం పాలైంది. ఇక అన్మోల్‌ 10-21, 18-21తో 4వ ర్యాంకర్‌, జపాన్‌కు చెందిన మియాజకి చేతిలో ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధృవ్‌ కపిల-రాధికా శర్మ జంట 15-21, 10-21తో 5వ ర్యాంకర్‌ చైనా షట్లర్ల చేతిలో, ధృవ్‌ రావత్‌-మనీషా జంట 9-21, 15-21తో 2వ ర్యాంకర్‌ చైనా షట్లర్ల చేతిలో పరాజయాన్ని చవిచూశారు. ఇక మహిళల డబుల్స్‌లో త్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌ 21-16, 21-9తో కెనడాకు చెందిన ఫన్‌ కా, లింగ్‌ యులను చిత్తుచేశారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తానీసా కాస్ట్రో, హంసకరణ్‌ జంట 26-28, 14-21తో మలేషియా చేతిలో ఓటమిపాలయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్