శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరెండో వన్డేలోనూ ఇండియా-ఎ ఓటమి

4 గంటల క్రితం

Sam Konstas CAP.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 11:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆస్ట్రేలియా-ఎతో అనధికారిక వన్డే సిరీస్‌

పుదుచ్చేరి: ఇండియా-ఎ జట్టు ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో వన్డేలోనూ పరాజయం పాలైంది. పాండిచ్చేరి క్రికెట్‌ అసోసియేషన్‌ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్‌ జట్టు 69పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌-ఎ జట్టు 49.5ఓవర్లలో 275పరుగులకు ఆలౌటైంది. కోన్టస్‌(67), ఫిలిప్పే(58) అర్ధసెంచరీలతో రాణించగా.. భారత బౌలర్‌ ఆర్షాద్‌(3/56) బౌలింగ్‌లో మెరిసాడు. అనంతరం ఇండియా-ఎ జట్టు 45.2ఓవర్లలో 206పరుగులకు ఆలౌటైంది. రజత్‌ పాటిధార్‌(67) అర్ధసెంచరీతో రాణించగా.. ఆసీస్‌ బౌలర్‌ జాన్సన్‌(3/35) బౌలింగ్‌లో రాణించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్‌ జట్టు మరో వన్డే మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్