సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

462 పరుగులకు భారత్ ఆలౌట్

1 గంట క్రితం

team india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- శ్రీలంకకు ఆరంభంలోనే షాక్

గాలె: గాలె టెస్టులో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. వర్షం కారణంగా ఆటకు పలుమార్లు అంతరాయం కలిగినప్పటికీ భారత బ్యాటర్లు సత్తా చాటారు. ముఖ్యంగా దేవదత్ పాటికల్ అద్భుత శతకంతో భారత్‌కు భారీ స్కోరు అందించాడు. పాటికల్ 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో 167 పరుగులు చేశాడు. ఇది అతడి తొలి టెస్టు సెంచరీతో పాటు కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరు. మిడిల్ ఆర్డర్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన పాటికల్.. శ్రీలంక బౌలర్లపై ఒత్తిడి కొనసాగించాడు. భారత్ తరఫున కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురెల్ 51 పరుగులు, రిషబ్ పంత్ 39 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లు పడగొట్టగా, అరంగేట్రం చేసిన కేశర నువంత మూడు వికెట్లు సాధించాడు.

శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ

భారత్‌ను ఆలౌట్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ నిషాన్ ఫెర్నాండోను మహమ్మద్ సిరాజ్ సున్నా పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. పాటికల్ క్యాచ్ పట్టడంతో ఫెర్నాండో ఇన్నింగ్స్ ముగిసింది. తాజా సమాచారం అందేసరికి శ్రీలంక 3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించేందుకు బౌలర్లు మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్